ఎపి లో కొత్తగా అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు బిల్లును వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రవేశ పెట్టారు. దేశంలోనే మొదటిసారిగా ఈ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చె్పారు.వ్యవసాయ పరిశోదన, విస్తరణ, వ్యవసాయ విద్య మొదలైన వ్యవసాయ సంబందిత అంశాలన్నిటిని ఈ సంస్థ పర్యవేక్షణ చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా వ్యవసాయ కాలేజీలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.వీటిపై నియంత్రణ లేదని ఆయన అన్నారు. 1956లో మెడికల్ కౌన్సిల్ ఏర్పడిందని, తదుపరి డెంటర్ కౌన్సిల్ వంటివి ఏర్పాడ్డాయని, కాని వ్యవసాయానికి సంబందించి ఎలాంటి కౌన్సిల్ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని ఆయన అన్నారు. వ్యవసాయ గ్రాడ్యుయేట్లు సొంతంగా ప్రాక్టీజ్ చేయడానికి వీలుగా ఈ కౌన్సిల్ అనుమతి ఇస్తుందని ఆయన అన్నారు. వారిలో ఎవరైనా అన్ ఎధికల్ గా పనిచేస్తే వారి అనుమతిని రద్దు చేస్తామని ఆయన చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగుముందులు, ఇరిగేషన్ టెక్నాలజీ, ఎగుమతులు మొదలైన విషయాలలో ఈ కౌన్సిల్ కు అధికారం ఉంటుందని కన్నబాబు తెలిపారు. tags : kannababu