A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా తో మరో ఎమ్.పి కన్నుమూత
Share |
January 24 2021, 8:38 pm

కరోనా సామాన్యులను,ప్రముఖులను కబళిస్తోంది.తాజాగా మరో పార్లమెంటు సభ్యుడు కరోనా కారణంగా మరణించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్ కరోనాతో కన్నుమూశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన కరోనా బారినపడటంతో రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందించారు. కానీ అక్కడ తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయినా పరిస్థితి మెరుగు కాక పోవడంతో భరద్వాజ్ తుది శ్వాస విడిచారు. ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్.పి అహ్మద్ పటేల్ కన్నుమూయగా, ఇప్పుడు బిజెపి ఎమ్.పి మరణించడం విషాదం. వీరిద్దరూ గుజరాత్ కు చెందినవారే.

tags : carona, mp,died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info