గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విద్యుత్ రంగాన్ని నష్టాల్లోకి నెట్టారని, రెండు రూపాయలకు విద్యుత్ దొరికే అవకాశం ఉన్నా.. రూ.4.80 పైసలకు కొనుగోలు చేశారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ఆరోపించారు. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. 4 వేల మెగావాట్లకు తాము యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకున్నామని వెల్లడించారు. సౌర విద్యుత్‌ను తానే కనిపెట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరారు. అయితే బుగ్గన చెప్పివన్నీ అవాస్తవాలని అచ్చెన్నాయుడు అన్నారు. tags : buggana