A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం ఎత్తుపై ఇక సందేహాలు లేనట్లా!
Share |
January 24 2021, 8:58 pm

పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబందించి పోలవరం ప్రాజెక్టు అధారిటీ క్లారిటీ ఇచ్చింది.
పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వసామర్థ్యం తగ్గించలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్‌ ఇంజినీర్‌ ఏకే ప్రధాన్‌ తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించారన్న ప్రచారం అపోహేనని కొట్టేశారు. ఈ సందర్భంగా ఏకే ప్రధాన్‌ విలేకరులతో మాట్లాడుతూ డీపీఆర్‌ కు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉంటుందని, నీటి నిల్వసామర్థ్యం 194.6 టీఎంసీలు ఉంటుందని ఆయన తెలిపారు.

మొదటి సంవత్సరం 41.5 మీటర్ల ఎత్తు మేరకు నీటిని నిల్వ చేస్తారని చెప్పారు. రిజర్వాయర్‌ ప్రొటోకాల్‌ ప్రకారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తయ్యే క్రమాన్నిబట్టి నీటి నిల్వ సామర్థ్యం ఏటా పెరుగుతుందని తెలిపారు. నాలుగైదేళ్లలో పూర్తిస్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ చేస్తారని చెప్పారు. ఇప్పటికే కాంక్రీట్, హెడ్‌ వర్క్స్‌ పనులు 76 శాతం పూర్తయ్యాయన్నారు. మొత్తం ఆర్‌ అండ్‌ ఆర్, అన్ని పనులు కలిపి 41 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా.. కష్టమైన సమయంలో కూడా పనులు జరుగుతున్నాయన్నారు.

tags : polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info