అమరావతి భూమి స్కామ లో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితులు ఉన్నారని ఆడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హ:కోర్టుకు తెలియచేశారన్న వార్త ఆసక్తికరంగా ఉంది. అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలను డాక్యుమెంట్ నెంబర్లతో సహా ఆయన హైకోర్టు కు అందచేశారు. ఎన్నారైలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను కూడా కోర్టుకు సమర్పించింది. అమరావతి భూ కుంభకోణం వెనుక చాలా పెద్ద తలకాయలున్నాయని, సీఐడీ దర్యాప్తును కొనసాగనివ్వాలని అభ్యర్థిస్తూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. సీఐడీ అదనపు ఎస్పీ గోపాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించిన అంశాల్లో కీలక వివరాలివీ... tags : ap, highcourt