సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. కోర్టులను అడ్డం పెట్టుకుని ఎపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నవారికి ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవాలి.అందులో ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తొలగించాలంటూ వేసిన పిటిషన్ కు విచారణార్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఛీప్ జస్టిస్ కు హైకోర్టు న్యాయమూర్తులపై పిర్యాదు చేస్తూ రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా.. గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు.
పిటిషన్లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడమేంటని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది సీజేఐ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. tags : supremecourt