శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో సీతారామ్ ఆగ్రహంగా మీరు మమ్మల్ని బెదిరించలేరు..మీరు వేలు చూపితే భయపడం అంటూ వ్యాఖ్యానించారు.తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఆయన సీటు నుంచి లేచి నిరసన తెలిపారు. ఆయనతో పాటు మరికొందరు టిడిపి సభ్యులుక ఊడా స్పీకర్ పై విమర్శలు చేశారు.చంద్రబాబు నాయుడు ఏదో తీవ్రంగా మాట్లాడారని సభ్యులు అంబటి రాంబాబు తదితరులు చెప్పారు. చంద్రబాబు స్పీకర్ పట్ల వ్యవహరించిన తీరుపై క్షమాపణ చెప్పాలని వైసిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.చంద్రబాబు ,ఇతర టిడిపి ఎమ్మెల్యేలు వేలు చూపుతూ స్పీకర్ ను బెదిరించారని వారు ఆరోపించారు. తాను అవకాశం ఇస్తానని చెప్పినా టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించడం పద్దతికాదని స్పీకర్ అన్నారు. క్షమాపణ చె్బుతారా?లేదా అన్న విషయం చంద్రబాబు విజ్ఞతకే వదలిపెడతానని స్పీకర్ అన్నారు. tags : tammineni