హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోలింగ మందకొడిగా జరుగుతోంది.కొన్ని చోట్ల పది శాతం పోలింగ్ కూడా జరగలేదు. ఆయా పోలింగ్ కేంద్రాలలో ఒక్కొక్కరుగా వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో పలుచోట్ల బూత్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాగా కొన్ని చోట్ల టిఆర్ఎస్,బిజెపి కార్యకర్తల మద్య వివాదాలు, తగాదా సాగుతున్నాయి. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బు తీసుకు వెళ్లి పంచుతున్నారంటూ బిజెపి ఆరోపించి ఆయన కాన్వాయ్ లోని ఒక కారుపై బిజపి కార్యకర్తలు దాడి చేశారు. కాగా ఓల్డ్ మలక్ పేటలో సిపిఐ అభ్యర్ది గుర్తు తప్పు పడడంతో ఎన్నిక వాయిదా పడింది. tags : hyderbad, electons