A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టివి షో ల మాదిరి హైకోర్టులో వాదోపవాదాలు
Share |
January 24 2021, 9:26 pm

ఎపి హైకోర్టులో జరిగిన ఒక చర్చ అనండి, వాద ప్రతివాదాలు అనండి..అచ్చం మాబోటి వాళ్లం నిర్వహించే టివి షో లను తలపించేలా సాగాయనిపిస్తుంది. మతి లేని చర్య అన్న పదంపై వచ్చిన ఈ చర్చ చివరికి జడ్జిగారు ఏకంగా మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనతో పోల్చడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ జడ్జిగారి భావన ఏమిటో కాని, ఒక కేసు విచారిస్తూ, మరో కేసు వేరే బెంచ్ లో విచారణ జరుగుతుండగా ,ఆ అంశంపై ఇలా వ్యాఖ్యానించడం సమంజసం కాదని ప్రభుత్వ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ గుర్తు చేశారు. టీవీ షోలలో అయితే చర్చ కు సంబందం లేని సబ్జెక్టు ను ఎవరైనా తీసుకు వస్తే చర్చను నిర్వహిస్తున్న వాళ్లం వెంటనే ఇది చర్చ కాదు..అని చెప్పి అసలు టాపిక్ లోకి తీసుకు వస్తారు. కాని హైకోర్టులో ఆ అవకాశం ఉన్నట్లు లేదు. న్యాయ వ్యవస్థలోని వారు ఏమైనా మాట్లాడవచ్చు..అది రాజకీయ ఉపన్యాసం లా అనిపించినా తప్పు కాదు..ఎవరైనా అది తప్పు కదా అంటే కోర్టు దిక్కారం అంటూ కన్నెర్ర చేసే అవకాశం వారికి ఉంటుంది. ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ కాని, కొన్ని నెలల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత శాంతి భద్రతులు దృష్ట్యా,, చంద్రబాబు నాయుడునుపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు నిలువరించారు. దీనిపై పడిన పిల్ లో పై విచారణ జరిపితే జరపవచ్చు. జడ్జిగారికి ఏవైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవచ్చు. తప్పు లేదు. కాని ఏ జడ్జిగారైనా ఒక పక్షం తరపున మాట్లాడుతున్నారన్న అబిప్రాయం కలిగితే అది న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. తాను న్యాయమూర్తిని కనుక రాజ్యాంగం,, చట్టంతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడవచ్చని అనుకుంటే అది ప్రమాదకర ధోరణి అవుతుంది. అందువల్లే ప్రభుత్వ న్యాయ వాది కూడా అంతకన్నా సీరియస్ గానే జవాబు ఇచ్చారు. జడ్జిగారికి రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయని బాధ వ్యక్తం చేశారు. హెబియస్ కార్పస్ సిటిషన్ కు, మూడు రాజధానులకు సంబందం ఏమిటో అర్ధం కాదు. ఒకే..ప్రస్తుతం ఒక రాజధాని బదులు మూడు రాజధానులు ఏర్పాటు కావడం ఆ జడ్జిగారికి ఇష్టం లేకపోవచ్చు. కాని అదే సమయంలో 151 మంది ఎమ్మెల్యేలు మూడు రాజధానుల చట్టానికి మద్దతు ఇచ్చారన్న సంగతి విస్మరించడం బాగోలేదు. పైగా ఇప్పటివరకు అయిన ఖర్చుకు తోడు లక్ష కోట్లు కావాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఉత్తరం రాసిన విషయం ఆ జడ్జిగారికి తెలియదని అనుకోవాలి. లేదా ఆయనకు పలుకుబడి ఉంటే లక్ష కోట్లు ఇప్పించడానికి హైకోర్టు కృషి చేస్తుందని హామీ ఇస్తే బాగానే ఉంటుంది. ఆయనను మెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుతో సహా సచివాలయం, అసెంబ్లీ భవనాలు అన్నీ తాత్కాలకి నిర్మాణాలే అన్న సంగతి ఆ న్యాయమూర్తికి తెలిసి ఉండాలి. అలాగే అమరావతిలో జరిగిన భూ కుంభకోణాలు, బలహీనవర్గాల భూములను కొందరు పలుకుబడిన వారు వశం చేసుకున్న తీరు ..వాటి గురించి కూడా న్యాయ వ్యవస్థలోని ప్రముఖులకు తెలిసి ఉండాలి కదా?అసలు అమరావతి స్కామ్ పై స్టే ఇవ్వడం, దానిని ఎక్కడా ప్రచారం చేయరాదని ఆదేశాలు ఇవ్వడం న్యాయ వ్యవస్థకు ప్రతిష్ట తెచ్చే అంశమేనని గౌరవ న్యాయమూర్తులు అనుకుంటే మనం ఏమీ చేయలేం.మరో నెల రోజులలో రిటైర్ కాబోతున్న న్యాయమూర్తిగారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. బహుశా ప్రభుత్వంపై ఆయనకు అసంతృప్తి ఉండి ఉండవచ్చు. రిటైరైన తర్వాత ఆ విషయాలు చెప్పినా ఎవరూ సీరియస్ గా తీసుకోరు కనుకే తనకు సంబందం ఉన్నా, లేకపోయినా, ఆయన తనకు సంబందం లేని కేసులలో తోచిన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారా?అన్న చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. ప్రభుత్వ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ హైకోర్టులో అత్యధికం రాజకీయ వ్యాజ్యాలే వస్తున్నాయని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని అంటున్నారు. హైకోర్టు తమ పరిమితులను విస్మరించి వ్యాఖ్యానిస్తున్నాయని ఆయన వాదించారు. ఒకవైపు చీఫ్ జస్టిస్ ఆద్వర్యంలో విచారణ జరుగుతున్న కేసులో మరో న్యాయమూర్తి కామెంట్ చేస్తే, దాని ప్రభావం కేసు విచారణ ఉండదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. నిజమే! ఎవరికైనా కొన్ని విషయాలపై అబిప్రాయాలు ఉండవచ్చు. ఇష్టాఇష్టాలు ఉండవచ్చు. కాని వారు రిఫరి వంటి వారని, అంటే న్యాయం చెప్పడానికి మాత్రమే వారు బాద్యత వహించాలన్న సంగతి ఏ సందర్భంలోనూ విస్మరించరాదు.ఒక విషయం గుర్తుకు వస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఎపి హైకోర్టులో కొందరు లాయర్లు జడ్జిలపై తిరగబడం, కొందరిపై దాడి చేయడం వంటి ఘట్టాలు జరిగిన సంగతి ఇతర రాస్ట్రాల నుంచి వచ్చిన కొందరు న్యాయ ప్రముఖులకు తెలిసి ఉండకపోవచ్చు. కనీసం అలా గొడవలు చేసిన వారిపై కేసులు పెట్టలేని నిస్సహాయ పరిస్థితిని ఆనాడు న్యాయమూర్తులు ఎదుర్కున్నారు. ఎపిలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్నా, రాజ్యాంగం విఫలం అయిందన్నంతవరకు న్యాయమూర్తులు వెళ్లడం దురదృష్టకరం.ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో ప్రభుత్వాన్ని ఏమైనా అనడం మతి ఉన్న చర్య అని న్యాయ వ్యవస్త భావిస్తే ,సామాన్య ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే స్వేచ్చ తమకు ఉండదా అని భావిస్తే ఎవరు జవాబు ఇవ్వాలి?ఇలాంటి పరిణామాల నేపధ్యంలోనే ఎపి ప్రభుత్వం ఎపి హైకోర్టు పరిస్థితిపై సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిందన్న అబిప్రాయం ఏర్పడింది. అయినా న్యాయ వ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదేమోనన్న భావన ఇలాంటి వ్యాఖ్యల వల్ల కలుగుతుంది. నేరస్తులు ప్రజాప్రతినిదులు అవుతున్నారని న్యాయమూర్తి బాధపడడం బాగానే ఉంది. అదే సూత్రం న్యాయ వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రాపకంతోను, ఇతరత్రా పలుకుబడితో ఉన్నవారు న్యాయమూర్తులు అవుతున్నారన్న విమర్శలు కూడా జాతీయ స్థాయిలో వస్తున్నాయి. ప్రజా ప్రతినిదులు అయితే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలకు వెళ్లాలి. క ఆని గౌరవ న్యాయమూర్తులు అలా ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం ఉండదు.అందువల్ల ప్రజాప్రతినిదులపై ఎలాంటి వ్యాఖ్యలైనా చేయండి. కాని న్యాయమూర్తుల గౌరవం పెరిగేలా, ప్రతిష్ట పెరిగేలా వ్యవహరించకపోయినా, వ్యాఖ్యలు చేయకపోయినా అది ఆయా వ్యవస్థలకు ,సమాజానికి అధిక నష్టం జరుగుతుందని గౌరవ న్యాయస్థానం వారు. ధర్మమూర్తులుగా ఉండవలసిన న్యాయమూర్తులు గమనించాలని కోరుకోవడం తప్పు కాకపోవచ్చు. ఈ విషయాలు ప్రస్తావించడంలో కేవలం వ్యవస్థలు భాగుండాలన్న ఆకాంక్ష తప్ప, న్యాయ వ్యవస్థను దిక్కరించాలన్న, అగౌరవపరచాలన్న అబిప్రాయంతో కాదని గౌరవ న్యాయ స్థానం భావిస్తే చాలు.

tags : ap highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info