A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్రమ మైనింగ్- జెసి కి వంద కోట్ల జరిమానా
Share |
January 24 2021, 9:33 pm

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డికి భారీ జరిమానా విధించారు. త్రిశూల్‌ సిమెంట​ ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించారు. రూ. 100 కోట్ల జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి.. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారు. అంతేకాకుండా అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారు. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్‌ మైనింగ్‌ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

tags : jc diwarkar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info