A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ బ్రాండ్ -కెటిఆర్ వ్యాఖ్య
Share |
November 25 2020, 7:15 am

హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కాదని, భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబద్ భారత దేశంలోనే అత్యంత అరుదైన, చారిత్రాత్మక నగరమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హైదరాబాద్ ఆకర్షిస్తోందని, ఆరేళ్ల కింద హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవన్నారు. హైదరాబాద్‌లో గొడవలు వద్దు అభివృద్ధి కావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతీ బిడ్డ తెలంగాణ గడ్డకు చెందినవాడే అని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు.
నోయిడా, ఘజియాబాద్ లాంటి ప్రాంతాలు కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాతవారికి కూడా సమున్నత స్థాయిలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టామని, ఐదు టాప్ ఫైవ్ కంపెనీలు గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్‌, ఫేస్‌బుక్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని ఆయన గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ గొప్పతనమని, దాన్ని కాపాడుతున్నామని తెలిపారు. ఇక్కడ పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info