A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ ఎన్నికలు-రంగంలోకి కేంద్ర మంత్రి
Share |
November 25 2020, 7:19 am

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిమిత్తం కేంద్ర మంత్రులు కూడా రంగ ప్రవేశం చేస్తున్నారు.కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలపై చార్జీషీట్ విడుదల చేశారు. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని ఆయన అన్నారు. కేసీఆర్, హరీష్, కేసీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం అవుతుందని ఆయన అన్నారు.

tags : prakash javadekar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info