A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి వేసిన వలలో పడతారా
Share |
November 25 2020, 7:28 am

బజిఎపి ప్రయత్నాలు సఫలం అవుతాయో ,లేదో కాని ఆ పార్టీ ఇతర పార్టీలలో ఉన్న ప్రముఖులను ఆకర్షించడానికి యత్నాలు కొనసాగిస్తోంది. శాసనమండలి మాజీ చైర్మన్ ,టిఆర్ఎస్ నేత స్వామిగౌడ్ ఇటీవలికాలంలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో ఆయనను బిజెపిలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే స్వామి గౌడ్‌ మాత్రం పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వలేదు. ‘పార్టీ మారితే చెప్పే మారుతా.బీజేపీ నేతలతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమే. స్నేహితులను కలిశాను. అది కూడా తప్పేనా’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత , మాజీ కేంద్ర మంతి సర్వే సత్యనారాయణ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌ రెడ్డితో కూడా మంతనాలు జరిపారు. సర్వే బిజెపిలో చేరవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే కొండా మాత్రం పార్టీ మారడానికి అంత సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info