A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం..
Share |
November 25 2020, 7:34 am

పచ్చగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కెటిఆర్ కోరారు.హ:దరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇండియా– పాకిస్తాన్‌. హిందూ– ముస్లిం అంటూ విద్వేషాలు రెచ్చగొట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను నగర ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌లో మరెక్కడా ఆలయాలే లేవన్నట్లుగా పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంలోనే వారి అసలు ఉద్దేశం అర్థమవుతోందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని నరకం చేయాలని చూస్తున్న వ్యక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ రకమైన హైదరాబాద్‌ ఉంటే మన పిల్లాపాపలు ప్రశాంతంగా ఉంటారో, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇది హైదరాబాద్..అహ్మదాబాద్ కాదని ఆయన అన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info