A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మత విద్వేషాల వలలో పడవద్దు- కెటిఆర్
Share |
November 25 2020, 7:40 am

తెలంగాణ మున్సిపాల్ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కె.టిఆర్ బిజెపిపై విమర్శలు కురిపిస్తున్నారు. గత ఆరు నెలల్లో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని,మత విద్వేషాల వలలో పడకుండా... సిటీజనులు అభివృద్ధిని చూసి గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు..ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌ నగరం ఎంతో ప్రశాంతతతో ఉందని, ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని చెప్పారు. కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుం డా నగర ప్రజలందరం కలిసిమెలిసి ఉంటు న్నామన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతా వరణాన్ని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొన్న కరోనా వచ్చినా, నిన్న వరదలు వచ్చి నా ప్రజల వెంట ఉన్నది టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేననే విషయం ప్రజలకు తెలుసన్నారు. వరదలతో ఇబ్బందిపడిన పేదలకు ప్రభు త్వం చేస్తున్న వరదసాయాన్ని ఆపింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎన్ని కల్లో గెలిస్తే రూ.25 వేలు ఇస్తామని కొంతమంది ప్రజల్ని మభ్యపెడుతున్నారని, అంతేకాదు చలాన్లు కడతాం, అందిస్తాం, ఇదిస్తాం అంటూ తలాతోక లేకుండా మాట్లాడుతున్నా రని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అందజేసిన రూ. 10 వేల వరద సహాయాన్ని అడ్డుకున్నవాళ్లు రూ. 25 వేలు ఇస్తామని చెప్పడం... అమ్మకు అన్నం పెట్టనోళ్లు చిన్నమ్మకు బంగా రు గాజులు చేయిస్తామన్నట్లుగా ఉందన్నారు. మరో వైపు కారు పోతే కారు.. బైకు పోతే బైకు ఇస్తామంటూ వస్తారని, వాటిని ఏమాత్రం నమ్మవద్దన్నారు. గతంలో అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, ఎవరి అకౌంట్‌లోనైనా పడ్డాయా? అని ప్రశ్నించారు.మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్‌ కాదు, హుషార్‌ హైదరాబాద్‌’అని గుర్తుపెట్టుకోవాలని బీజే పీని ఉద్దేశించి అన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info