A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ ఎస్ కు పోసాని మద్దతు
Share |
November 25 2020, 7:31 am

ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ అభ్యర్దులను జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలలో గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రా ప్రజలపై కేసీఆర్‌కు ఏమాత్రం కోపం లేదని, కేవలం దోచుకున్న వారిపైనే కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తమేనని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, కేసీఆర్‌ లాంటి పట్టుదల ఉన్న సీఎంను చూడలేదని సోనాని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో గతంలో నీరు ఉండేది కాదు.. రైతులకు అనేక ఇబ్బందులు ఉండేవికేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో పవర్ కట్ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ప్రాంతాలు పచ్చదనంతో ఉన్నాయి. గ్రామాలు అభివృద్ధి చెందాయి’ అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని సోసాని అన్నారు.

tags : posani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info