జనసేన అదినేత పవన్ కల్యాణ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బల్క సుమన్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదం. ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడు. అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడంవిడ్డూరం. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు..?. విస్తృత ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంట.. ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటుని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్కు గ్రేటర్ ప్రజలు తగిన బుద్ది చెప్తారు. కిషన్రెడ్డి నిస్సహాయుడు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు అని ఆయన అన్నారు. tags : sunab , pawankalyan