ఎపి రాజధాని అమరావతి పై ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హెబియస్ కార్పస్ పిటిషన్ కు సంబందించిన విచారణలో ఆయన రాజదాని అంశం తీసుకువచ్చి ప్రభుత్వానివి మతిలేని పనులు కావంటారా? అంటూ ప్రశ్నించారు. అమరావతిలో పలు నిర్మాణాలను ఆపేశారని, దీనివల్ల ఎంతో ప్రజాధనం వృథా అవుతుందని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది సత్యనారాయణ ప్రసాద్ స్పందిస్తూ రాజధాని అంశం త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. చీకటి పడితే వెనక్కి వచ్చేందుకు భయపడే చోట హైకోర్టును నిర్మించారన్నారు. ఈ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి, నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయడం గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ నేరస్తులను ఎన్నికల నుంచి దూరం చేయాలంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి జైలుకెళితే జైల్లో ఉన్నంత కాలం ఆ వ్యక్తికి ఓటు హక్కు ఉండదని, కానీ అదే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కూడా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెబుతోందని జస్టిస్ రాకేశ్‌కుమార్ తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. tags : ap highcourt