గ్రేటర్ హ:దరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఒక్క ఓటు కూడా తమ క్యాడరుకు సంబందించినవి బయటకు వెళ్లకుండా, బిజెపికి పడాలని ఆయన అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి బిసి మోర్చా లద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లతో మాజీ స్పీకర్ నాదెండ్ల మరోహర్ నివాసంలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తమకు మద్దతు ప్రకటించడంపై కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు హర్షం ప్రకటించారు. కాగా తమ క్యాడర్ కు కొంత నిరుత్సాహం ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ అభివృద్దికి బిజెపి గెలవవలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రదాని మోడీ హైదరాబాద్ అబివృద్దికి ఎంతో చేస్తున్నారని ఆయన అన్నారు. బవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.కాగా జనసేన అభ్యర్దులు 30 మంది నామినేషన్లు వేసినా వారంతా ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. tags : bhp, janansena