A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ పదవి
Share |
November 25 2020, 8:17 am

తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి అన్వేషణలో పడింది. ఎమ్.పిగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబం వారితో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారని మంత్రి బొత్స తెలిపారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. కాగా జగన్ నిర్ణయంపై కళ్యాణ్ మాట్లాడుతూ తాము జగన్ తో సుదీర్ఘ ప్రయానం చేయాలని భావిస్తున్నామని అన్నారు.తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

tags : ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info