తమ పార్టీకి మేయర్ పీఠం అప్పగిస్తే హైదరాబాద్ లో వరద బాదిత కుటుంబాలకు పాతికవేల రూపాయల చొప్పున ఇస్తామని ఆ పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అంతేకాక వరదబాదితుల వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇస్తామని ఆయన అన్నారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. తాను వదర సాయం చేయడాఇనకి అడ్డం పడ్డానని ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్దం చెప్పారని, అందుకే తాను ఇక్కడకు వచ్చి ప్రమాణం చేస్త్ఉన్నానని, ముఖ్యమంత్రి కసిఆర్ వస్తారని ఆశించానని ,కాని రాలేదని ఆయన అన్నారు. మతతత్వ ఎమ్.ఐ.ఎమ్.తో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ మత రాజకీయం చేస్తోందని, తాము మత రాజకీయాలు చేయడం లేదని అన్నారు. విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చారని సంజయ్ ద్వజమెత్తారు. tags : bandi snjay