A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిమ్మగడ్డ కూడా రాజకీయ పరిభాషలోకి..
Share |
November 25 2020, 8:31 am

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వివాదాన్ని కొనసాగించడానికే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.ప్రభుత్వం రాజకీయ పరిభాషను ఆయన వాడినట్లు కనిపిస్తుంది. ‘‘స్థానిక ఎన్నికలు నిర్వహించేది మేము. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీకి సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు.ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రభుత్వం వక్రభాష్యం చెబుతోందని సీఎ్‌సకు రాసిన లేఖలో నిమ్మగడ్డ విమర్శించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని మాత్రమే న్యాయస్థానం చెప్పిందని ఆయన అన్నారు. ‘‘ఎన్నికల తేదీలు ప్రకటించాల్సింది, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది మేమే. ఈ విషయంపై మిమ్మల్ని సంప్రదించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. అంతే తప్ప, మీ నిర్ణయంతో మాకు సంబంధం లేదు’’ అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో చూడాలని సీఎ్‌సకు సూచించారు. ‘‘సుప్రీం తీర్పును అమలు చేయండి. ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పీలుకు వెళ్లండి. అంతే తప్ప... ఎస్‌ఈసీకి సహకరించకపోవడం సరికాదు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది. తీవ్రమైన క్రిమినల్‌ చర్యగా భావించాల్సి ఉంటుంది’’ అని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.తాను జిల్లా కలెక్టర్ లతో మాట్లాడితే వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు.మంత్రులు కూడా ఉద్యోగులను రెచ్చగొట్టేలా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఆయన ద్వజమెత్తారు.‘‘ఎన్నికలు ఇప్పుటికిప్పుడు నిర్వహిస్తామని చెప్పలేదు. ఫిబ్రవరిలో నెలలో నిర్వహించాలన్నది ఒక ఆలోచన. దానికి మీరు ఇప్పుడే ఆందోళన చెందుతూ కమిషన్‌కు లేఖ రాయడం సరికాదు. ప్రభుత్వ వైఖరి అన్ని రకాల ఉల్లంఘనల కిందకు వస్తుంది. ఇప్పటికీ మించిపోలేదు. ఎన్నికల కమిషన్‌కు సహకరించండి. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు. ఒక్కసారి మీరూ సరిచూసుకోండి’’ అని ఆయన పేర్కొన్నారని మీడియాలో కదనం వచ్చింది. సీఎస్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో... గురువారం నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌ను కూడా నిమ్మగడ్డ రద్దు చేశారు.

tags : nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info