A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Share |
January 16 2021, 3:14 am

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డి.కె. సత్యప్రభ కన్నుమూశారు.ఆమె వయసు డెబ్బై ఏళ్లు. గత లోక్ సభ ఎన్నికలలో ఆమె టిడిపి పక్షాన రాజంపేట నుంచిపోటీచేసి ఓడిపోయారు.దివంగత మాజీ ఎమ్.పి డి.కె. ఆదికేశవులు నాయుడు సతీమణి.గత నెల పదో తేదీన ఆమె కరోనా పాజిటివ్ కు గురయ్యారు. సొంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె పుట్టపర్తి సాయిబాబాకు భక్తురాలు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీకే ఆదికేశవులుతో దగ్గరుండి ఆమె వివాహం జరిపించారు. అప్పటివరకు సాధారణ ఉద్యోగి, వ్యాపారవేత్తగా ఉన్న ఆదికేశవులు పెళ్లి తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. 2014లో టీడీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

tags : dk satya prabha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info