A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో అల్లర్లని విష ప్రచారం చేశారు
Share |
December 2 2020, 5:36 pm

తెలంగాణ ఏర్పడితే అల్లర్లు జరుగుతాయని గతంలో విష ప్రచారం చేశారని,కాని టిఆర్ఎస్ అధికారంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే ముఖ్యమంత్రి కేసీఆరే కారణంమని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌పై విపరీతమైన దుష్ప్రచారం చేసినవారంతా నేడు కనుమరుగైయ్యారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎక్కడా గిల్లికజ్జాలకు పోకుండా అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని వివరించారు. టీఆర్‌ఎస్‌ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో పటిష్ట శాంతిభద్రతలున్నాయని చెప్పారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉగాదికి ప్రారంభిస్తామని తెలిపారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info