A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ- ఏమి జరిగింది
Share |
December 2 2020, 5:42 pm

ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన సందర్భంగా ఏమి జరిగిందన్న విషయం పెద్దగా బయటకు వచ్చినట్లు లేదు. ఎన్నికల కమిషనర్ కు అనుకూలంగా గవర్నర్ మాట్లాడి ఉంటే ఆయన టిడిపి మీడియాకు ఆ వివరాలు లీక్ చేసే అవకాశం ఉండేదన్న అబిప్రాయం ఉంది. అలాకాకుండా మామూలుగా రాసినట్లు రాసి, గవర్నర్ స్పందించకపోతే నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లవచ్చని టిడిపి మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే నిమ్మగడ్డ బుదవారం నాడు తలపెట్టిన జిల్లా కలెక్టర్లు తదితర అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకోవడం ద్వారా తాను సొంతంగా తీసుకునే అన్ని నిర్ణయాలు అమలు చేయడం అంత తేలిక కాదని ఆయన అర్ధం చేసుకుని ఉండాలన్న అభిప్రాయం వస్తుంది. సోసల్ మీడియాలో మాత్రం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీపై రెండు రకాల వాదనలు ప్రచారం జరుగుతున్నాయి. కరోనా కేసులు లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసి ,ఇప్పుడు ఎందుకు హడావుడి పడుతున్నారని గవర్నర్ ప్రశ్నించారని ఒక ప్రచారం.కాదు..సానుకూలంగానే గవర్నర్ విన్నారని మరో ప్రచారం . వీటిలో ఏది నిజమో ?

tags : nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info