A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం పై ఎదుకు అబద్దాలు రాస్తున్నారు
Share |
December 2 2020, 5:47 pm

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు.దీనివల్ల ఆంద్రప్రదేశ్ లో ఏ ప్రాంతానికి ఉపయోగం ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ నేతలు, టిడిపి మీడియా చేస్తున్న ప్రచారం .ఆ ప్రకటనలు చూసినా, వాటిని చదివినా ఏమనిపిస్తుంది?టిడిపి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉంటే, వైసిపి ప్రభుత్వ హయాంలో దానిని తగ్గించి వేస్తున్నారు కాబోలు అన్న సందేహం వస్తుంది.పోలవరం ప్రాజెక్టును ప్రస్తుతం కాంట్రాక్టు కు తీసుకున్న మేఘా కంపెనీ వేగంగా పనులు చేస్తుండడంతో , ఏదో ఒక వివాదం సృష్టించాలని ఆ పార్టీ నేతలు కాని, ఆ పార్టీ మీడియావారుకాని గత కొన్నాళ్లుగా విష ప్రచారం చేస్తున్నారు.నిజానికి ఒకసారి కట్టిన ప్రాజెక్టు ఎత్తును ఎవరైనా తగ్గించగలరా? ప్రజలను అపోహలలో పెట్టి టిడిపికి రాజకీయ లబ్ది చేకూర్చాలన్న దుష్ట తలంపుతో ఆ వర్గం మీడియా ఉన్నవి, లేనివి కలిపి ప్రచారం చేస్తున్నాయి.మొదట ఏమన్నారు.కేంద్రం ప్రాజెక్టు వ్యయం తగ్గించేసేంది.కేంద్రం పెట్టిన షరతులకు ఒప్పుకుంటేనే 2300 కోట్ల పెండింగు నిదులను ఇస్తారు అని ప్రచారం చేశారు. కాని ముఖ్యమంత్రి జగన్ ప్రదాని మోడీకి పోలవరంప్రాజెక్టుపూర్తి వివరాలతో లేఖ రాశారు. ఆర్ధిక శాఖ వారు కారణం ఏమో కాని,పెండింగులో ఉన్న 2300 కోట్ల నిదులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో టిడిపి వారికి జీర్ణించుకోని సమస్యగా మారింది.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అయితేపోలవరం ప్రాజెక్టును ఆపేశారన్నంతగా ప్రచారం చేస్తుంటారు.నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ప్రకటన చేస్తూ ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి వీలు లేదని, పునరావాసం కింద మొత్తం 29 వేల కోట్లు చెల్లించాల్సిందేనని, తద్వారా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.కాని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ మేరకు ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై వైసిపి ఎమ్.పిలు ఎందుకు పోరాడడం లేదని ఆయన ప్రశ్నించారు.అదే సమయంలో అసెంబ్లీలో ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఉమా మాట్లాడుతూ 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపుతామని సాక్షిపత్రికలో రాసుకో అంటూ సవాల్ చేశారు. మరి ఆ ప్రకారంఎందుకు పూర్తి చేయలేదో ఉమా ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు?అంతే కాదు..2016లో ఈ ప్రాజెక్టును రాష్ట్రం తీసుకునే సమయంలో 2013 నాటి ధరలు కాకుండా పెరిగిన ధరలు అంచనా కింద తీసుకోవాలని దేవినేని కాని, చంద్రబాబు కాని ఎందుకు కేంద్రానికి చెప్పలేదన్నదానికి ఇంతవరకు జవాబు రాలేదు. ఇక్కడ ఒక వాస్తవం తెలుసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఎటిఎమ్ ల ఉపయోగపడుతోందని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దానికి ఇంతవరకు చంద్రబాబు కాని, ఉమా కాని సమాదానం ఇవ్వలేకపోయారు. అప్పట్లో దర్మపోరాట దీక్షలు అంటూ ప్రభుత్వ ఖర్చుతో వందల కోట్లు ఖర్చుచేసిన టిడిపి నేతలు, ఇప్పుడు కేంద్రాన్ని ఒక్క మాట అనడానికి జంకుతున్నారు. ప్రదాని మోడీని విమర్శించడానికే వణుకుతున్నారు.దానికి కారణాలుఏమిటో అందరికి తెలుసు. అయినా ఎపి బిజెపి నేతలు తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు ఒక విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పంపిన డబ్బులో అక్రమాలు జరిగాయని, టిడిపి ఎమ్మెల్యే ఒకరు మూడు అపార్టుమెంట్లు నిర్మించారని, అలాగే విజయవాడలోపదికోట్లతో ఒక అతిధి గృహం నిర్మించారని ఆరోపించారు. దానిని టిడిపి కనీసం ఖండించే యత్నం కూడా చేసినట్లు కనిపించలేదు. మోడీని మాత్రమే కాదు..వీర్రాజును కూడా ఒక్క మాట అనే సాహసం టిడిపి నేతలు చేయలేకపోతున్నారు. మరో నేత రఘునాధబాబు ఇంకో సంగతి చెప్పారు. చంద్రబాబు ప్రాజెక్టులో మునకకు గురయ్యే భూమి విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, సుమారు పాతికవేల కోట్ల రూపాయల మేర అక్రమాలు ఉంటాయని ఆరోపించారు.ప్రభుత్వ భూములను టిడిపి వారివన్నట్లు చూపించి డబ్బ తినేశారని ఆయన ఆరోపించారు.మొదట భావించిన మునక భూమికి, ఆ తర్వాత చంద్రబాబు ఇష్టారాజ్యంగా మునక భూమిని పెంచేసిన తీరుకు చాలా తేడా ఉందని, అందుకే కేంద్రం అభ్యంతరాలు చెబుతోందని ఆయన అన్నారు. వీటికి చంద్రబాబు లేదా దేవినేని ఉమా సమాదానం ఎందుకు ఇవ్వడం లేదు. మరో టిడిపి మీడియా ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటల్ల ఎత్తునుంచి 41.15 మీటర్ల కు తగ్గిస్తున్నారని ,దాని వల్ల రాయలసీమ దుర్బిక్ష ప్రాంతాలకు నీరు అందదని, ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు అందదని, అసలురాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడదన్నట్లు టిడిపి మీడియా ప్రచారం చేస్తోంది.ఇది నిజమా ?కాదా అని ఆలోచించాలి.ఒక్కసారి ప్రాజెక్టు ఎత్తుకు కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత దానిని ఏప్రభుత్వం తగ్గించదు. ఇక్కడ సమస్య ముంపు ప్రభావం ఏ ఎత్తులో ఉంటుందన్నదానిపై ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం ప్రదాన ప్రాజెక్టుపూర్తి అయిన తర్వాత నీటిని నిల్వ చేస్తారు. ప్రస్తుతం కేంద్రం భూ సేకరణ అంశంపై సందేహాలతో ఉంది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం బూ సేకరణ విషయంలో విజిలెన్స్ విచారణ జరుపుతోంది. అది ఒక కొలిక్కి వస్తే అందులో ఎంత సొమ్ము తిన్నారో, తినే యత్నం చేశారో తేలుతుంది.కనీసం పదిహేను వేల ఎకరాల ప్రభుత్వబూమిని టిడిపి నేతలు లాగించేశారట. అంతేకాదు. లేని భూమిని ఉన్నట్లు చూపించారట. వాటిలో వాస్తవాలు రావాలి.ఇది ఒక అంశం అయితే ఏ ప్రాజెక్టులో అయినా ఒక్కసారే పూర్తి నీటి మ్టంలో నీరు నిలవ ఉంచరు. క్రమేపీ ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి ఆ మేరకు నీటిని నిల్వ చేస్తారు.దీనివల్ల నీటి నిల్వ 190 టి.ఎమ్.సిలు ఉండదని, అప్పుడు నష్టం జరుగుతుందని వీరు చెబుతున్నారు. డెబ్బై శాతం పూర్తి చేశామని టిడిపి నేతలు ఒక వైపు చెబుతూ, మరో వైపు ఎత్తు తగ్గిస్తున్నారని దుస్ప్రచారం చేస్తుండడం విశేషం. అయితే నిజంగానే నీటి నిల్వ తక్కువగా ఉంచడం వల్ల పోలవరం కుడి, ఎడమ కాల్వలకు గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే అది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేదే. కాని అలా జరగదు. రెండువైపులా నీటిని తరలించడానికి వీలుగానే ప్రణాళిక సిద్దం చేస్తారు.కాకపోతే ముంపు ప్రాంతాలకు సంబందించి వేలాది కోట్ల వ్యయం ఒకేసారి చేయలేరు కనుక ముందుగా అవసరమైన మేర గ్రామాలను ఖాళీ చేయించి,వారికి ఇళ్లు కట్టిస్తున్నారు.ఏ ప్రాజెక్టుకు అయినా ఇలాగే వ్యవహరిస్తారు. ఉదాహరణకు పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేయడానికి కొన్ని సంవత్సరాలుపట్టింది. దానికి కారణం గుంటూరు జిల్లాలో కొంత భాగం, తెలంగాణలోని కొన్ని గ్రామాలుమునకకు గురి అవుతున్న నేపద్యంలో ఒక్కసారే నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయలేదు. అనేకసార్లు తెలంగాణప్రభుత్వానికి 150 కోట్లు చెల్లించితే పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయవచ్చని గతంలో వార్తలు వచ్చాయి.వాటిని ఎప్పటికి చెల్లించారో దేనినేని ఉమాకు తెలియదా?అంతేకాదు..గతంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కాపర్ డామ్ పూర్తి చేసి దాని ద్వారా గ్రావిటీ లో కాల్వలకు నీళ్లు ఇస్తామని చెప్పినప్పుడు అది ప్రమాదకరమైన ప్రతిపాదన అని భయపడ్డారు.కాపర్ డామ్ తోనే నీరు ఇవ్వగలిగినప్పుడు డామ్ పూర్తి చేసి, మునక ప్రాంతాలకు తగినట్లుగా నీరు నిల్వ చేస్తే గ్రావిటీ ద్వారా పోలవరం కుడి,ఎడమ కాల్వలకు నీళ్లు ఇవ్వలేరని టిడిపి మీడియా రాస్తే జనం నమ్ముతారా? ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి ఆంద్ర ప్రజలను మోసం చేసే లక్ష్యంతో ఒక పత్రిక జలం రాదు..జీవం రాదు..ఎత్తు తగ్గిస్తే పోలవరం కుదేలే అని విఫపు రాతలు రాస్తోంది.తద్వారా పోలవరం ప్రాజెక్టులో టిడిపి హయాంలో జరిగిన అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించాలని యత్నిస్తున్నట్లుగా ఉంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి 2022 ఖరీప్ లో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు.కొంచెం అటు,ఇటుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే టిడిపి వారికి,ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు జీర్ణం కావడం కష్టం, అప్పుడు కొత్తరాతలు రాస్తారు..అంతా తమవల్లే జరిగిందని ప్రచారం చేస్తారు. ఈలోగా మాత్రం ఇలాంటి విష ప్రచారం చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. పూర్తికాని పోలవరంప్రాజెక్టును చూడడానికే చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల వ్యయంతో ప్రజలను తరలించింది. ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో కాకుండా ప్రజలే స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి చూసి సంతోష పడే రోజు సత్వరంగానే వస్తుందని ఆశిద్దాం.

tags : polavaram, lies

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info