A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి, జనసేన కలిసి పోటీచేయవా?
Share |
December 2 2020, 6:18 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీచేయాలని నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన కొంత కాలం క్రితం భారతీయ జనతా పార్టీ నేతలను కలిసి ఆ పార్టీతో మైత్రి నడపడానికి అవగాహన పెట్టుకున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఆయన బిజెపి నేతల వెంటబడి వారి స్నేహం కోసం వెంపర్లాడారు. మరి ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో బిజెపితో కలిసి పోటీచేస్తామని ఆయన ప్రకటించినట్లు కనబడలేదు. అలాగే బిజెపి కూడా జనసేనతో కలిసి పోటీచేస్తామని ఇంతవరకు చెప్పలేదు. దుబ్బాక లో బిజెపి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ బిజెపి నేతలను అభినందించారు. అంతకుముందు తెలంగాణ బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ తన వద్దకు వచ్చినప్పుడు పరస్పరం సహకరించుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు రెండు పార్టీలు ఆ సంగతి తెలపకుండా ఎవరికివారు ఎన్నికల ప్రకటనలు చేస్తుండడం విశేషం. మరి వచ్చే కొద్ది రోజుల్లో ఏమైనా అవగాహన పెట్టుకుంటారా?లేక ఎవరికి వారు పోటీచేస్తారా అన్నది చూడాలి. లేక ఎపి వరకే బిజెపితో పొత్తులో ఉండడానికి పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారా?

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info