A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వరదసాయానికి బ్రేక్ -తెలివైన చర్యేనా
Share |
December 2 2020, 6:46 pm

మొత్తం మీద ప్రభుత్వం జాగ్రత్త పడిందని అనుకోవాలి. హైదరాబాద్ లో వరద సాయం కింద ఇస్తున్న పదివేల రూపాయల కోసం వేలాది మంది క్యూలలో నిలబడి ఉంటున్నందున ఏర్పడుతున్న అలజడి నేపద్యంలో ఎన్నికల కమిషన్ వరద సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ సాయం ఆపివేయాలని, వచ్చే నెల నాలుగో తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత తిరిగి ఈ సాయం పంపిణీ చేయవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒక రోజు ముందు వరదసాయం కొనసాగించవచ్చని ఆదేశించిన ఎన్నికల కమిషన్ ఒక రోజులోనే తన వైఖరి మార్చుకుని ఎన్నికల కోడ్ అంటూ ఈ ప్రకటన చేయడంలోని ఆంతర్యం ఊహించడం కష్టం కాదు. ప్రస్తుం మీ సేవా సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున జమ అవుతున్న ప్రజల వల్ల టిఆర్ఎస్ కు చికాకు ఏర్పడుతోంది. ఇప్పుడు వరద సాయానికి బ్రేక్ వేయడం ద్వారా ఎన్నికల వరకు ఈ సమస్యను పక్కనబెట్టినట్లయింది.ఎన్నికల కమిషన్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందో ,లేక ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారో తెలియదు కాని మొత్తం మీద తెలివైన నిర్ణయమే చేశారనుకోవాలి.

tags : hyderabad, floods

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info