A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంచాయతీ ఎన్నికలకు నో- ఎపి సి.ఎస్
Share |
December 2 2020, 6:28 pm

ఎపి ఎన్నికల కమిషనర్ తన ఇష్టం వచ్చినట్లు చేయడానికి అనుసరిస్తున్న పద్దతులను ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంతో సంబందం లేకుండా పంచాయతీ ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయగా, దానికి ప్రతిగా ఛీప్ సెక్రటరీ జవాబు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని ఆమె తన లేఖలో తెలిపారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆమె వివరించారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదని ఆమె స్పష్టం చేశారు.


రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలుని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో వ్యాఖ్యానించారు.

tags : neelam sahni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info