A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం అంచనాలు-చంద్రబాబుదే తప్పు
Share |
November 25 2020, 7:02 am

ఎపిలో పోలవరం సమస్య మళ్లీ వివాదం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గతంలో 2014 రేట్లకు పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి ఆమోదం తెలిపి తీవ్ర నష్టం చేసిందని, లక్ష మంది నిర్వాసితులను గాలికి వదలివేసిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. '2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రెండేళ్ల పాటు పోలవరాన్ని పట్టించుకోలేదు. అనంతరం 2016లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని టీడీపీ స్వాగతించి, పోలవరం కాంట్రాక్టును వారే తీసుకున్నారని ఆయన విమర్శించారు.కేంద్రం నిర్మించి ఇవ్వవలసిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్యాకేజీలో ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. 2014లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని బాబు కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమంటూ 2017లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ఆ సమయంలో కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. సవరించిన అంచనాలను అంగీకరించమని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ మంత్రులు ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఈ రోజు కేంద్రం కొర్రీలు వేస్తోందని ఆయన అన్నారు.. ఈ విషయాలన్నింటిపైనా త్వరలో ప్రధాని మోదీని కూడా కలుస్తాం. ఆ మేరకు పోలవరంపై కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ కూడా రాస్తారని అనిల్ యాదవ్ చెప్పారు.

tags : anil kumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info