A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్రల సమరానికి బ్రేక్ పడినట్లేనా
Share |
November 25 2020, 7:09 am

దసరా సందర్భంగా కర్నూలు జి్ల్లా దేవరగట్టు వద్ద జరిగే కర్రల సమరానికి బ్రేక్ పడడం మంచిదే. కరోనా నేపద్యంలో కరోనా సమరాన్ని నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అక్కడ గ్రామాల వారు రెండు జట్లుగా విడిపోయి విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. ఆ క్రమంలో కర్రలతో కొట్టుకుంటారు. ప్రతి ఏటా అనేక మంది ఈ సమరంలో గాయపడుతుంటారు. ఒక్కోసారి అది ప్రాణాలపైకి తెస్తుంటుంది.అయినా గ్రామస్తులు ఆ కర్రల సమరం నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం దానిని నిలుపుదల చేయడానికి అధికారులు ప్రయత్నిస్తుంటారు.కాని ఇంతకాలం సఫలం కాలేదు. మరి ఈ రాత్రికి దానిని నిలువరించగలరా?లేదా అన్నది చూడాలి.పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో ఉండి అక్కడ కాపలా కాస్తున్నారు.

tags : devaragattu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info