A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం వ్యయం-..చంద్రబాబు ప్రభుత్వ తప్పిదమేనా
Share |
November 25 2020, 8:16 am

పోలవంర ప్రాజెక్టుకు సంబందించి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి నష్టంగా మారిందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు. అర్దరాత్రి సమయంలో ఆనాడు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని, అందులో భాగంగా 2014 దరలకే పోలవరం నిదులు ఇచ్చేలా కేంద్రంతో ఒప్పందం అయ్యారని ఆయన అన్నారు.దీనివల్ల ఎపికి తీవ్ర నష్టం వాటిల్లిందని బుగ్గన అన్నారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఏదైనా మంచి జరిగింది అంటే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడమే. దురదృష్టవశాత్తూ విభజన తరువాత అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరించారు. కేంద్రం విధించిన షరతులకు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. 2017లో అంచనాలు సవరించాలని నిర్ణయించిన తర్వాత కూడా 2014 ధరల ప్రకారం చెల్లించాలని ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. పునరావాసం, భూసేకరణను వదిలిపెట్టడం తదితరాలన్నీ రికార్డుల్లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు బుగ్గన తెలిపారు. ఖర్చు చేసిన నిధులు షరతులు లేకుండా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు.

tags : buggana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info