A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గీతం యూనివర్శిటీ 40 ఎకరాలు ఆక్రమించిందా
Share |
November 25 2020, 8:21 am

విశాఖలోని గీతం యూనివర్శిటీ అదీనంలో ఉన్న సుమారు నలభై ఎకరాల ప్రభుత్వభూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని రుషి కొండ సమీపాన ఉన్న ఈ భూమి విలువైనదని, దీనిని ఆ యూనివర్శిటీ అక్రమంగా ఆక్రమించిందని అదికారులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూమి స్వాధీనం చేసుకున్నారని, ఆ భూమిలో ఉన్న కొన్ని కట్టడాలను కూల్చివేశారని గీతం యూనివర్శిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విద్యా సంస్థల మధ్యలో అండర్‌ పాసేజ్‌ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్‌ కాలేజ్‌కి మెడికల్‌ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్‌ పాసేజ్‌ నిర్మాణం పూర్తి చేసేశారు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని మీడియాలో కదనం వచ్చింది.

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info