A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ట్రాప్ లో పడకుండా జగన్ ..
Share |
November 25 2020, 8:28 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మూస రాజకీయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రత్యర్ది రాజకీయ నేతలపై ఉన్నవి,లేనివి ఆరోపణలు చేసి, బురద పూసి, తద్వారా ప్రజలను నమ్మించాలన్నది ఆయన సిద్దాంతం. ఆయనకు రెండు,మూడు పెద్ద మీడియా సంస్థలు మద్దతు ఇస్తుండవచ్చు. ఆయన ఏమి చెప్పినా వేదంలా ఆ మీడియా పాటించవచ్చు. కాని జనం వినడం లేదన్న సంగతి ఆయనకు అర్దం కావడం లేదు.అందుకే చంద్రబాబు ఇంకా పాత పద్దతిలోనే వ్యవహరిస్తున్నారు.గతంలో కూడా ఆయా సి.ఎమ్.లపై ఇలాగే బురద చల్లేవారు.కొన్నిసార్లు రాజకీయంగా ఉపయోగం జరిగి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయన్న సంగతి ఆయన తెలుసుకోలేకపోతున్నారు. తాజాగా టిడిపికి మద్దతు ఇచ్చే మీడియాలో వచ్చిన వార్త చదివితే ఆశ్చర్యం కలుగుతుంది.కరోనాలోను, వదరలు,బారీ వర్షాలలోను ఎపిలో ప్రభుత్వం చేతులెత్తేసిందట. ఇంతటి విఫల సి.ఎమ్.ను చరిత్రలో చూడలేదట. చంద్రబాబు చెప్పే ఈ డైలాగులను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించాయి కనుక, అవి చూసి ఆయన మురిసిపోవచ్చు. కాని ఆయన చెప్పినదానికి ఏవైనా ఆధారాలు చూపాలి కదా.. ప్రజలు గుడ్డిగా చంద్రబాబు ఏమి చెబితే దానిని నమ్మడానికి గాని, టిడిపి మీడియాలో వచ్చే వార్తలను నమ్మడానికి గాని ప్రజలు సిద్దంగా లేరని 2019 అసెంబ్లీ ఎన్నికలు తేల్చి చెప్పాయి. అయినా చంద్రబాబు వైఖరి కాని, ఆ వర్గం మీడియా తీరుకాని మారడం లేదు.చంద్రబాబు కు ఒక అలవాటు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడకు వెళ్లినా, తన జీవితంలో మర్చిపోలేనని, ఇంత గొప్ప ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని ఊతపదంగా వాడేవారు. అలాగే ఆయా సభలలో ప్రసంగిస్తూ తన జీవితంలో ఇంత పెద్ద సభ చూడలేదని ప్రతిచోట చెబుతుండేవారు. తాను చెప్పేవి అబద్దాలు అని ఆయనకు తెలుసు. అయినా వాటినే కొనసాగించడానికి ఆయన అలవాడు పడిపోయారు. ఇప్పుడు జగన్ విఫల సి.ఎమ్ అని చంద్రబాబు అన్నారంటే కచ్చితంగా జగన్ సఫలం అవుతున్నారని అర్దం చేసుకోవచ్చు. అలాగే ఎందుకంటే జగన్ ఎక్కువ సఫలం అవుతున్న కొద్ది చంద్రబాబు గంగవెర్రులెత్తుతుంటారు. లోపల తాను ఈ పని చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది. కాని అది దుగ్దగా మారి జగన్ పై విమర్శలు చేస్తుంటారు. నిజానికి చరిత్రలో ఒక ఏడాది కాలంలో ఇన్ని స్కీములు అమలు చేసిన ముఖ్యమంత్రగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. జగన్ ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి స్కీమ్ గురించి ఎన్నడైనా చంద్రబాబు ఆలోచించారా? ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలన్న ఆలోచన ఏనాడైనా చంద్రబాబు తలపెట్టారా? వలంటీర్ల వ్యవస్థతో పాటు , ప్రతి గ్రామ,వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచించారా? రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ వైద్య క్లినిక్ లు..ఇలా ఒకటేమిటి? ఎన్నో కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్ ది. జగన్ ఏదైనా కొత్త స్కీమ్ అమలు చేయబోతున్నారన్న సమాచారం రాగానే చంద్రబాబు, ఆయన వర్గం మీడియా ఏదో ఒక వ్యతిరేక వార్తను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తుంటుంది.ఈ స్కీములను అమలు చేస్తుంటే , చంద్రబాబు కాని, ఆ వర్గం మీడియా కాని ఏమని ప్రచారం చేశాయి?జనానికి డబ్బు పంచేస్తున్నాడని ఆరోపించాయా?లేదా? కరోనా కష్టకాలంలో పేదలకు ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడిందని వారికి తెలుసు. కాని జనం దానిని మర్చిపోవాలన్న భావనతో వీరు ఏమని ప్రచారం చేశారు? ఎపి లో అప్పులే,అప్పులు అంటూ వ్యతిరేక కధనాలు వడ్డించారా?లేదా?వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ఏ విధంగా దూషించింది అంతా చూశాం. కాని ఇప్పుడు అదే వ్యవస్థ ఎపిలో ప్రజలకు సేవలు అందిస్తున్న తీరుతో ప్రశంసలు అందుకుంటోంది.కరోనా సంక్షోభంలో ఎపి ప్రబుత్వం ప్రణాళికబద్దంగా వ్యవహరించిందో దేశం అతటినుంచి వచ్చిన ప్రశంసలే చెబుతాయి. ఈ విషయాలను ప్రజలు మర్చిపోవాలని,వేరే అంశాలు తెరపైకి రావాలన్నది చంద్రబాబు లక్ష్యం. ప్రతిపక్షం సహజంగానే తమకు అనుకూలమైన ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అది పెద్దగా తప్పు కాదు. కాని చంద్రబాబు మాత్రం చరిత్రలోనే ఇంత విఫల సి.ఎమ్. లేరని ప్రచారం చేయాలని తలపెట్టడంలోనే దుర్బుద్ది కనబడుతుంది. చంద్రబాబు టైమ్ లో వరదబాదితులకు ఏ రకంగా సాయం చేసింది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక ఘటన తెలియచేస్తుంది. ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ కు అక్కడ ఒక గ్రామం వారు పిర్యాదు చేస్తూ ,మొత్తం ఊరంతటికి కలిపి 500రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేసుకోమన్నారట. మరి ఇప్పుడు సహాయ శిబిరాలలో ఉన్నవారు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయిస్తే జగన్ విఫల సి.ఎమ్. అని చంద్రబాబు అంటే ఎవరైనా నమ్ముతారా? శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిత్లి తుపాను బాదితులపై ఏ విదంగా ఆగ్రహం కనబరించింది ఇప్పటికీ సంబందిత పేపర్ క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.విశాఖ పట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చాక ఆయన ఐదు కోట్ల రూపాయల బస్ లో నిద్రించి, అదేదో పెద్ద త్యాగం చేసినట్లు ప్రచారం చేసుకునేవారు. నిజానికి ప్రభుత్వ అతిధి గృహాలు అందుబాటులో ఉన్నా, పెద్ద హోటళ్లు ఉన్నా చంద్రబాబు షో కోసం బస్ లో గడిపేవారు. అంతేకాదు..హుద్ హుద్ తుపాను వల్ల ఏకంగా 60వేల కోట్ల నష్టం వచ్చిందని మొదట ప్రచారం చేసి , ఆ తర్వాత ఇరవై వేల కోట్లకు నివేదికను కేంద్రానికి పంపారు. ఆ తర్వాత ప్రదాని మోడీ వచ్చి అక్కడ నష్టాన్ని పరిశీలించి చంద్రబాబు ప్రభుత్వం అబద్దాలు చెప్పిందని తెలుసుకుని కేవలం వెయ్యి కోట్ల సాయం ప్రకటించడం , తదుపరి అందులో 600 కోట్ల వరకే ఇవ్వడం జరిగింది. అలా అబద్దాలు చెప్పడం లో జగన్ విఫలం అయ్యారని అంటే ఒప్పుకోవచ్చు. మరో మాటను చంద్రబాబు చెప్పారు. వరదలు, వర్షాల సమయంలో గంటకు ఒకసారి తానైతే టెలీకాన్ఫరెన్స్ పెట్టి అధికారులతో మాట్లాడేవాడినని ఆయన అన్నారు. ఏ మాత్రం విజ్ఞత ఉన్న నాయకుడు అయినా అలా చేస్తారా?పాలన బదులుగా ప్రచారం కోసమే ఇలాంటివి చేయాలి. లేకుంటే అధికారులు తమ పనులు మానుకుని నిత్యం సిఎమ్. టెలీకాన్ఫరెన్స్ లతో గడపవలసి వస్తుందన్న సంగతి తెలియదా? నిజమే ..ఇలాంటివి అన్నీ చేసి విఫల సి.ఎమ్ గా ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు ఇప్పుడు జగన్ కూడా అలాగే కావాలని కోరుకుంటున్నట్లుగా ఉంది.కాని జగన్ తెలివిగానే ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షం ట్రాప్ లో పడకుండా , ఆయన తన మానాన తాను పని చేసుకుంటూ,తాను అనుకున్న పధకాలను అమలు చేసుకుంటూ సాగుతున్నారు. అక్కడే చంద్రబాబుకు చిర్రెత్తుకు వస్తోంది.తాను ఎంత రెచ్చగొట్టినా జగన్ తన ట్రాప్ లో పడడం లేదేమిటా అన్నదే ఆయన బాద, అలాగే టిడిపి మీడియా బాధ తప్ప మరొకటి కాదు.చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా వాస్తవ పరిస్థులను అర్దం చేసుకుని , ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా మారితే మంచిది .లేకుంటే తెలుగుదేశం పార్టీని ఆయన చరిత్రపుటల్లో కలుపుతున్నట్లు అనుకోవచ్చు.

tags : chanrababu, politics

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info