A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గీతం కాలేజీ ఆక్రమణలకు పాల్పడిందా
Share |
November 25 2020, 7:05 am

విశాఖలో ప్రతిష్టాత్మకమైన గీతం విద్యా సంస్థల యాజమాన్యం సుమారు నలభై ఏకరాలు ఆక్రమించిందని అధికారుల పరిశీలనలో వెల్లడైందట.గత సర్కారు అండతో రుషికొండ, ఎండాడలో 40.51 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివిధ స్థలాల్ని గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించినట్లు జిల్లా రెవెన్యూ అధికారులు నిర్ధారించారని కదనం వచ్చింది. ఎండాడలోని సర్వే నం. 15,16,17,18,19,20, రుషికొండలోని సర్వే నం. 55,61లో ఆక్రమించిన 22.21 ఎకరాల చుట్టూ రక్షణ గోడ నిర్మాణం, సర్వే నం. 34,35,37,38లో 18.30 ఎకరాల విస్తీర్ణంలో గీతం యూనివర్సిటీ గార్డెనింగ్‌ నిర్మాణంతో పాటు గ్రావెల్‌ బండ్‌ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్డీవో పెంచల్‌ కిశోర్‌ ఇచ్చిన నివేదికతో పాటు సిట్‌ కూడా తమకు వచ్చిన ఫిర్యాదు నంబర్‌.2670 ప్రకారం విచారణ చేపట్టింది. మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు దీనిపై చర్యలకు ఉపక్రమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోందని మీడియా కధనం చెబుతోంది.మళ్లీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారేమో!

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info