A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థానిక ఎన్నికలు-నిమ్మగడ్డ ఉత్సాహం
Share |
November 25 2020, 7:11 am

ఎపిలో స్థానిక ఎన్నికలు తిరిగి నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్సాంగా ఉన్నట్లు కనిపిస్తోంది.ఒక్క కరోనా కేసు మాత్రమే ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే యత్నం చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాలలో ఆయన పలుమార్లు హైకోర్టుకు వెళ్లారు. తాజాగా రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పారీ్టల నుంచి అభిప్రాయాలను సేకరించాక తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఎలాగైతేనేం ఈసారి ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పడం విశేషం.

tags : nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info