A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ పత్రిక రోదన ఇందుకేనా
Share |
October 27 2020, 9:18 am

ఎపిలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆ పత్రిక ఏడుపు అని అంటారా?రోదన అని అంటారా? అది పతాక స్థాయికి చేరుకుంటోందని అనుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్తానం వారు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో డబ్బు పెట్టబోతున్నారని ఒక రోజు, టిటిడి బంగారాన్ని ఎస్.బిఐలో పెడుతున్నారని మరో రోజు రాసి ,అదేదో తప్పు పని మాదిరిగా చూపించడానికి ఆంద్ర జ్యోతి పత్రిక ప్రయత్నిస్తోంది. దీనికి కారణం ఒకటే ఎపి ప్రభుత్వానికి ఎటు వైపు నుంచి నిదులు కాని, అప్పులు కాని పుట్టకూడదన్నదే వారి కోరికే. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రవేటు బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ లో 1400 కోట్ల రూపాయల డిపాజిట్ చేసినా, కిమ్మనని ఈ పత్రిక, ధర్మ పోరాట దీక్షలకు టిటిడి డబ్బువాడి ప్రదాని మోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేసినా సమర్దించిన ఈ పత్రిక ఇప్పుడు సమస్య ఉన్నా,లేకున్నా ఉన్నవి లేనివి కలిపి కధనాలు వడ్డిస్తోంది.తాజాగా ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బిఐ లో బంగారాన్ని డిపాజిట్ చేసినా తప్పు అన్నట్లుగా రాస్తోంది.ఐఓబిలో బంగారం పెట్టకుండా ఎస్పిబి లో పెట్టడం తప్పన్నట్లుగాను, ప్రభుత్వానికి ఎస్బిఐ అప్పు ఇవ్వడానికి సిద్దంగా ఉందని, అందుకే బ్యాంక్ లో బంగారం డిపాజిట్ చేశారని ఈ పత్రిక రాస్తోంది. అంటే ఈ పత్రిక ఉద్దేశం అర్దం అవుతోంది కదా!దేశంలోనే అతి పెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంకులో బంగారం పెట్టినా దానికి దురుద్దేశం ఆపాదిస్తూ ప్రజలను మాయ చేయాలని ,తద్వారా ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించాలని ఈ పత్రిక కాని, టిడిపికి మద్దతు ఇచ్చే మరి కొన్ని మీడియా సంస్థలు తంటాలు పడుతున్నాయి. మరి ఆ మీడియా రోదన లేదా ఏడుపును జనం నమ్ముతారా?

tags : media,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info