A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జస్టిస్ రమణ కరెక్టుగానే చెప్పారు
Share |
October 27 2020, 9:23 am

సుప్రింకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ కరెక్టుగానే చెప్పారనుకోవాలి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఆటుపోట్లకు గురైనా న్యాయమూర్తులు ధైర్యంగా నిలబడాలని ఆయన సూచించారు. ఇది జడ్జిలకు కావల్సిన ముఖ్య లక్షణమని ఆయన అన్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక న్యాయమూర్తి నైతిక సూత్రాలకు కట్టుబడి నిర్భయంగా తన నిర్ణయాలను అమలు పరచాలి. శ్రీరాముడిని ప్రజలు ఆరాధిస్తున్నది ఆయన విజయాలు సాధించినందుకు కాదు. అత్యంత క్లిష్టమైన సమయంలో కూడా అత్యంత హుందాతో వ్యవహరించినందుకే ఆయనను ఆరాధిస్తున్నా రు అని రమణ పేర్కొన్నారు. ఎంత సంపాదించాం, ఏమి చేశాం, ఏం జరిగింది, ఏది జరగలేదు అన్నది ముఖ్యం కాదు. ఏం జరిగినా ఎలా ప్రవర్తించామన్నదే ముఖ్యం. అదే మన సమగ్రతను నిర్ధారిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఎంతో అవసరమని ఆయన అబిప్రాయపడ్డారు.
............
ప్రజలు కోరుకుంటున్నది కూడా అదే కదా!శ్రీరాముడితో పోల్చడం బాగానే ఉంది కాని, జడ్జిలు అలా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా?లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది కదా!

tags : nv ramana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info