A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉండవల్లి వ్యాఖ్యలు
Share |
October 27 2020, 9:10 am

రాజమండ్రి మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్యలు ఒక్కో టీవీలో ఒక్కోరకంగా వస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి జగన్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ బాబ్డేకి లేఖ రాయడం తప్పు కాదని అన్నట్లు వార్త వస్తే, మరో టీవీలో ప్రచారం కోసమే జగన్ ఆ లేఖను బయటపెట్టారని అన్నట్లు కదనం వచ్చింది. న్యాయ వ్యవస్థపై చర్చ జరగాలని ఆయన అన్నారు. వర్చువల్ విదానంలో నేతలపై కేసులు విచారించాలని, వాటిఇని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన సూచించారు.ఈ విషయమై తాను సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ కు మెయిల్ ఇచ్చానని ఆయన అన్నారు. ఎపి హైకోర్టు డిజిపిని పిలవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మార్గదర్శి కేసు సుప్రింకోర్టులో విచారణ కు రాకుండా కొందరు చూశారని ఆయన ఆరోపించారు.
15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్‌ కుమార్‌ అన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు. జగన్‌ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు.. గతంలో జడ్జీలపై ఎఫ్‌ఐఆర్‌ కట్టిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.

tags : undavalli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info