A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్యాగ్ ఆర్డర్ కొనసాగుతున్నట్లేనా-ఎపి హైకోర్టు
Share |
December 2 2020, 6:30 pm

ఎపి హైకోర్టు చీప్ జస్టిస్ మహేశ్వరి చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉన్నప్పట్టికీ గ్యాగ్ ఆర్డర్ ను సవరించకపోవడం విశేషం. ఎపి ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ప్రెస్ మీట్ పెట్టి సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ కు రాసిన లేఖలోని అంశాలను బయటపెట్టినందున తమ గ్యాగ్ ఆర్డర్ నిష్పలం అయిందని ఆయన అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి.మాజీ ఎజి దమ్మాలపాటి మరికొందరి భూబాగోతానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ప్రచురణ, ప్రసారం చేయవద్దని మీడియాను నియంత్రిస్తూ జారీచేసిన గ్యాగ్‌ ఉత్తర్వులను సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. దమ్మాలపాటి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న న్యాయవాది మమతారాణి అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఇంప్లీడ్, గ్యాగ్‌ ఆర్డర్‌ సవరణకు మమతారాణి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఇటీవల ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పెట్టిన మీడియా సమావేశంవల్ల తామిచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులు నిష్ప్రయోజనమయ్యాయని వ్యాఖ్యానించారు. ఆ సమావేశంలో అమరావతి భూకుంభకోణం ఎఫ్‌ఐఆర్, ఇతర డాక్యుమెంట్లు, సీఎం రాసిన లేఖను ప్రతీ ఒక్కరికీ ఇచ్చారని సీజే తెలిపారు. దీంతో తామిచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను సవరించాల్సిన అవసరంలేదని సీజే వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వ న్యాయవాది ఏకీభవించలేదు. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ.. అజేయ కల్లం చెప్పిన వివరాలకు, మీడియా గ్యాగ్‌ ఉత్తర్వులకు సంబంధంలేదన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ఆయన బహిర్గతం చేయలేదని వివరించారు. సీజే మాత్రం ఈ వాదనలను అంగీకరించలేదు.నిష్పలం అయ్యాయంటూనే, గ్యాగ్ ఆర్డర్ ను గౌరవ హైకోర్టు వారు ఎత్తివేయకపోవడం విశేషమే.

tags : ap, gag order

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info