A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జస్టిస్ రెడ్డప్పరెడ్డి విశ్లేషణ్ ఆసక్తిగా ఉంది
Share |
October 27 2020, 9:38 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రంఇకోర్టు జడ్జి రమణపైన, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైన సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ బాబ్డేకి లేఖ రాయడంపై రిటైర్డ్ న్యాయమూర్తి రెడ్డప్ప రెడ్డి చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. 1961 జరిగిన ఘటనను కూడా ఆయన వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేయడంలో గానీ, ఆ ఫిర్యాదును బహిర్గతం చేయడంలో గానీ ఎంత మాత్రం తప్పులేదని జస్టిస్‌ రెడ్డప్ప రెడ్డి అన్నారు. ‘న్యాయపరంగా మాట్లాడాలంటే ఆ ఆరోపణలు వాస్తవమని భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను వారు ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండనతో వస్తే, అప్పుడు ముఖ్యమంత్రి తగిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి రాలేదు’అని ఆయన వివరించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఫిర్యాదు ఇచ్చింది సాధారణ వ్యక్తేమీ కాదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి ఉన్నరాన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఫిర్యాదు ఏంటి? ఆ ఫిర్యాదును బలపరిచేలా ఆధారాలున్నాయా? అన్నదే ముఖ్యం. న్యాయమూర్తులపై ఓ ముఖ్యమంత్రి కేంద్రానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం అన్నది ఇదే మొదటిసారి కాదు. నేను 1961లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యాను. అప్పుడు జస్టిస్‌ చంద్రారెడ్డి ప్రధాన న్యాయమూర్తి. ఆయనపై దామోదరం సంజీవయ్య 9 పేజీల ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదులో చాలా ఆరోపణలు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అంతిమంగా అది జస్టిస్‌ చంద్రారెడ్డి బదిలీకి దారి తీసింది. జస్టిస్‌ చంద్రారెడ్డి మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాబట్టి సీజేఐకు లేఖ రాయడంలో తప్పేమీ లేదు. అని ఆయన వివరించారు. లేఖ రాసినప్పుడు దానిని బహిర్గతం చేయడం కూడా తప్పు కాదు. ముఖ్యమంత్రి లేఖ రాశారు. దానిని ప్రభుత్వ ప్రతినిధిగా అజయ్‌ కల్లం ప్రెస్‌కు రిలీజ్‌ చేశారు. ఇందులో తప్పు ఎంత మాత్రం లేదు. సుప్రీంకోర్టుకు గానీ, సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి గానీ, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు గానీ సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. అని ఆయన వివరించారు. సుప్రింకోర్టు అంతర్గతంగా కమిటీ వేసి విచారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి సుమోటోగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చు. విచారణ జరిపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వివరణ కూడా కోరవచ్చు. అని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : reddappa reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info