A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు క్యాడరే లేకుండా పోయింది
Share |
December 2 2020, 6:40 pm

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుల్లో ఆర్థికంగా బలోపేతం అవుతామనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నాయకులు సూట్‌కేసులు సర్దుకొని వచ్చారని, అయితే ఇక్కడ క్యాడర్‌ లేకపోవడంతో దారి చూపించే నాథుడే కరువయ్యారని విమర్శించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడైనా దుబ్బాకకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడూ రాని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుండటంతో తాము ప్రజలకు చేరువయ్యామని పేర్కొన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ఏం చేయాలో అర్థంకాని కాంగ్రెస్‌ నేతలు మాయ మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు.

tags : harish rao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info