A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం నిజంగా ఉందా..
Share |
September 23 2021, 3:12 am

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాని అది సాధ్యం అవుతుందా అన్నది సంశయమే. అయితే పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి మాత్రం దుబ్బాక నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని అంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని, టీఆర్‌ఎస్‌ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగు పడిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే కన్పిస్తుందని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అక్రమ సంపాదన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడం టీఆర్‌ఎస్‌కు రివాజుగా మారిందన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర ఉప ఎన్నికలో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ , దుబ్బాకలో గెలుస్తుందా?

tags : uttamkumar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info