A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఆత్మానందమా
Share |
December 2 2020, 6:50 pm

తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మానందం అంటే ఇదేనేమో!వారు ముఖ్యమంత్రి జగన్ పై పలు రకాల విమర్శలు, వాటిలో కొన్ని పిచ్చి విమర్శలు చేసి ఆనందపడిపోతున్నారు. ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నేతలతో జూమ్ లో మాట్లాడారట. ఆ సందర్భంగా ఎడిఆర్ అనే సంస్థ నివేదిక ప్రకారం జగన్ కు పది నుంచి ముప్పై ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని చంద్రబాబు కనిపెట్టారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, విజయవాడలో యువతిపై దాడి ఘటనను ఆయన ప్రస్తావించారు.అది శాంతి భద్రతల లోపం అని కూడా ఆయన తేల్చేశారు. ముఖ్యమంత్రి జగన్ న్యాయ వ్యవస్థపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు.అమరావతి ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు కట్టుబానిసల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఇతర టిడిపి నేతలు కూడా పలు విమర్శలు చేశారు. ఎమ్.పి గల్లా జయదేవ్ అయితే 2022 లో జమిలి ఎన్నికలు వస్తాయని అన్నారు.

..........

చంద్రబాబు పై ఉన్న కేసుల్లో అసలు శిక్షలు పడకుండా జాగ్రత్తపడుతున్నారా? ప్రేమోన్మాది చేసిన దానికి కూడా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో ఒక సైకో చిత్తూరు జిల్లాలో అనేక మందిని చంపారు. మరి దానిని ఏమనాలి?

tags : chandrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info