A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎంత తేడా..ప్లైఓవర్ ప్రారంభోత్సవంలో
Share |
January 16 2021, 3:13 am

విజయవాడ కనకదుర్గ గుడి వద్ద కృష్ణా నది మీదుగా నిర్మించిన వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ల పద్దతిలో ప్రారంబించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడిన విషయాలు కాని, అనుసరించిన విధాపం రాపి ,చాలా సింపుల్ గా నే కాకుండా ఆచరణాత్మకమైన రీతిలో ఉన్నాయని చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని అబినందించిన వైనం, ఆ తర్వాత తమ రాష్ట్రానికి కావల్సిన మరికొన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేసిన తీరు చక్కగా ఉంది. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా ఎపికి ఏ విధంగా సాయం చేయదలించింది వివరిస్తూ ,ముఖ్యమంత్రిని డిల్లీకి ఆహ్వానించడం విశేషం.గత ప్రభుత్వ టైమ్ లో అయితే ఇందుకు బిన్నంగా సొంత డబ్బాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండేవారు. ఇప్పుడు అలా కాకుండా అవసరమైన విషయాలకు విఐపిలు పరిమితం అయి, భవిష్యత్తులో కూడా సహకరించుకుటామని చెప్పడం బాగుంది.అంతేకాక ఈ సందర్భంగా గడ్కరి రహదారులపై ప్రమాదాల నివారణకు పూర్తి మద్దతు ఇస్తామని, తమిళనాడులో మాదిరి చేయాలని ఆయన జగన్ కు సూచించడం కూడా బాగుంది.చంద్రబాబు టైమ్ లో ఈ వంతెన పూర్తి కాకపోవడంతో జగన్ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది.

tags : kanakadurga flyover

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info