న్యాయ వ్యవస్థలో అక్రమాలు జరిగినా, ఎవరూ మాట్లాడకూడదని, పిర్యాదులు చేయరాదన్నట్లుగా ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుండగా, సీనియర్ న్యాయవాది ప్రశృంత భూషణ్ న్యాయవ్యవస్థలో ఆరోపణలు వచ్చినవారిపై విచారణ జరగాలని అభిప్రాయపడుతు్ననారు.న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు ప్రజల్లోకి వెళితేనే చర్యలకు వీలుంటుందని ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంలో కానీ, ఆ లేఖను బయటపెట్టడంలో కానీ ఎలాంటి తప్పూ లేదని ఆయన అన్నారు. అభిశంసన లాంటి అవసరం వస్తే... ఆరోపణల గురించి తెలిస్తేనే కదా పార్లమెంటు సభ్యులు ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల గొంతు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత నిలబడదని స్పష్టంచేశారు. తాజా వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా విచారణ జరుపుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారాయన. అమరావతి ల్యాండ్ స్కామ్ ఎఫ్ఐఆర్పై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటాన్ని ప్రశాంత భూషణ్ తప్పు పట్టారు. tags : prasanth bhusaan