వరదలు, వర్షాల వల్ల ఎక్కువ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు లాగా కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే సీఎం జగన్మోహన్ రెడ్డి కాదని నష్టం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో సహాయం చేసే మనస్తత్వం జగన్‌ది అని పేర్కొన్నారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదని, జూమ్ మీటింగ్‌లు మానుకొని చంద్రబాబు రాష్ర్టానికి రావాలన్నారు. రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాథమికంగా విశాఖలో 5795 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయంలో పెడతారని, ఎవరి పేర్లయినా జాబితాలో లేకపోయినా నమోదుకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. tags : avanti