ఒక కేసులో విచారణ పూర్తి చేసి ,తీర్పును రిజర్వు చేసిన తర్వాత, అదే న్యాయమూర్తి ఆ కేసును మరో జడ్జి కి బదిలీ చేయాలని ఆదేశించవచ్చా అన్న చర్చ జరుగుతోంది. ఎపి హైకోర్టులో ఈ ఘటన జరిగిందని వచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది.రాజధాని అమరావతిలో అస్సైన్ డ్ భూముల స్కామ్ లో తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఆకస్మాత్తుగా ఈ పిటిషన్‌ను రిలీజ్ చేశారని వార్త వచ్చింది. ఈ కేసు సుప్రింకోర్టుకు కూడా వెళ్లి వారంలో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ వ్యాజ్యం రోస్టర్ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు విచారణకు రాగా, ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేశారు. అయితే గురువారం ఈ పిటిషన్ జస్టిస్ రాయ్ ముందున్న కేసుల విచారణ జాబితాలో ‘ఫర్ బీయింగ్ మెన్షన్డ్’ శీర్షిక కింద లిస్ట్ అయింది. ఈ పిటిషన్‌ను తాను రిలీజ్ చేస్తున్నానని, దీనిని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై పాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన కేసును రిలీజ్ చేయడానికి గల కారణాలు నిర్దిష్టంగా తెలియరాలేదని ఆ కదనం వెల్లడించింది. tags : ap, highcourt