A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను అధికారంలో ఉంటే..చంద్రబాబు
Share |
October 27 2020, 8:20 am

వరదల సమయంలో తాము అదికారంలో ఉంటే,గంట,గంటకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహింఏవారమని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని ఒక వార్త వచ్చింది.
యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. హైదరాబాద్‌లోని నుంచి టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆర్టీజీఎస్‌ ద్వారా అంచనా వేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేవాళ్లం. అధికార యంత్రాంగమంతా అక్కడే మకాం వేసేలా చూసేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే తిరిగి వచ్చేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైఎస్సార్‌సీపీకి లెక్కేలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారట.
...............................
గంట,గంటకు టెలికాన్ఫరెన్స్ లు నిర్వహిస్తే అధికారులు పనిచేయడానికి టైమ్ ఎక్కడ ఉంటుందండి?

tags : chandrababu, power

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info