A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇంటి చుట్టూరా వరద నీరు
Share |
October 27 2020, 8:22 am

కీష్ణానది కరకట్టపై ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం చుట్టూ వరద నీరు చేరినట్లు వార్త వచ్చింది.ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్‌ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్‌హౌస్‌లు వరదనీటిలో మునిగిపోయాయని మీడియా వార్తలు సూచిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్‌ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందన బ్రదర్స్‌ గెస్ట్‌హౌస్‌ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్‌లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్‌ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్‌హౌస్‌ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయినా తెలుగుదేశం మీడియా దీనిపై కూడా కావాలని ముంచుతున్నట్లు ప్రచారం చేస్తుండడం విశేషం.

tags : babu, water

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info